10 నుంచి సత్యదేవుడి దర్శనాలు

అన్నవరం : 6 జూన్ 2020:(రెడ్ బీ న్యూస్): భక్తులకు ఈ నెల 10 నుంచి సత్యదేవుడి దర్శన భాగ్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 8,9 తేదీల్లో ప్రయోగాత్మకంగా ఉద్యోగులు, గ్రామస్థులతో ట్రయల్ రన్ వేసి లోటుపాట్లు సవరించుకోవాలని అధికారులు సూచించారు. గంటకు 300 మంది చొప్పున రెండు లైన్ల ద్వారా 600 మం దికి దర్శనం కలగనుంది. నిత్యాన్నదానం తాత్కాలికంగా నిలుపుదల చేయనున్నారు. అతి తక్కువ మంది నాయిబ్రాహ్మణులతో కేశఖండనకు అనుమతి లభించింది. భక్తులు పూర్తిగా వేడినీటితో స్నానమాచరించిన తర్వాతే మొక్కులు చెల్లించుకోవాలి. మెట్ల మార్గం, టోల్ గేట్, దర్శనాల ప్రారంభ ద్వారం వద్ద ధర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. నాయిబ్రాహ్మణులకు పీపీఈ కిట్లను అందించాలని నిర్ణయించినట్టు ఈవో త్రినాథరావు తెలిపారు. ప్రతి గంటకు కొద్ది సమయం దర్శనాలు నిలుపుదల చేసి లైన్లు, పరిసరాల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసిన తర్వాత రెండో బ్యాచ్ కు దర్శనం కల్పించనున్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us