Updated 2 February 2022 Wednesday 02:00 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఉద్యోగుల సమస్యలపై చర్చలకు సిద్ధమని చెప్పామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా చర్చలకు రవాలని, ఉద్యోగుల కార్యాచరణ పక్కనపెట్టాలని చెప్పామన్నారు. అయినా సమ్మెకు వెళ్లకముందే ఉద్యోగులు రోడ్డెక్కడం సరికాదన్నారు. ఓ విధంగా ఉద్యోగులు గురువారం చేసేది బలప్రయోగమన్నారు. వైషమ్యాలు పెంచడం ద్వారా ఏం సాధిస్తారని సజ్జల ప్రశ్నించారు. కొవిడ్ ఆంక్షలు ఉన్నందున ఉద్యోగుల ఆందోళనకు పోలీసులు అనుమతివ్వరన్నారు. ప్రధాన సమస్యలపై చర్చిద్దామంటే.. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయని సజ్జల అన్నారు.







