UPDATED 18th MAY 2018 FRIDAY 8:30 PM
సామర్లకోట: స్థానిక సంపంగితోటలో గల భారత్ మాతా సేవా పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. భారత్ మాతా సేవా పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొర తండ్రి చక్రధరరావు ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివాణం, నందమూరి రంగ, వడ్డాది శివ, తమకు శ్రీను, మహంకాళి దుర్గా ప్రసాద్, మూతిన రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.







