TTD: తిరుమలలో కొవిడ్ నిబంధనలు మరింత కఠినం: వై.వి సుబ్బారెడ్డి

తిరుమల (రెడ్ బీ న్యూస్) 9 జనవరి 2022 : దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం దృష్ట్యా తిరుమలలో కొవిడ్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో కొవిడ్ మార్గదర్శకాల అమలుపై అదనపు ఈవో ధర్మారెడ్డి, ఇతర అధికారులతో ఆదివారం సమీక్షించారు. ఈ నెల 18న వైకుంఠ ఏకాదశి, 14న ద్వాదశితో పాటు మిగిలిన 8 రోజులు.. భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జనసమూహం ఉండే ప్రాంతాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి ఒక్క భక్తుడు, ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ ఆదేశించారు. ఇందుకోసం భక్తులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us