గుండెపోటుతో వలంటీర్ మృతి

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 29 నవంబరు 2021 : గుండెపోటుతో గ్రామ వలంటీర్ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కాండ్రకోట గ్రామంలో సోమవారం జరిగింది. పంచాయతీ కార్యదర్శి రాజన్ రాజు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ సచివాలయం 2లో క్లస్టర్ నంబర్ 15లో వలంటీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆనంద్ కుమార్ వన్ టైమ్ సెటిల్మెంట్ పథకంలో భాగంగా సచివాలయంలో సొమ్ములు చెల్లించి ఛాతిలో నొప్పి అని స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అతనిని వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వలంటీర్ మృతిపట్లు పంపిణీ ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి సచివాలయ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us