UPDATED 26th JUNE 2017 MONDAY 3:00 PM
పెద్దాపురం: పెద్దాపురం పట్టణ, మండల పరిధిలోని గ్రామాల్లో రూ. 40 కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జె. తిమ్మాపురం గ్రామంలో
రూ.2.10 కోట్ల నాబార్డ్ నిధులతో ఖండికాలువ పై నిర్మించిన వంతెనను హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి ప్రారంభించారు. అలాగే కాండ్రకోటలో రూ.ఆరు కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పెద్దాపురం, తామరాడ ప్రధాన రహదారి విస్తరణకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 30 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన పెద్దాపురం- సామర్లకోట ప్రధాన రహదారి విస్తరణకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నా సరే అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో మెరుగైన రహదారుల నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. అనంతరం హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ దత్తత గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, పెద్దాపురం, సామర్లకోట పట్టణాలను మరింత అభివృద్గి దిశగా తీర్చి దిద్ధేందుకు కృషి చేస్తానన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. అనంతరం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రూ. 24 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట ఎఎంసి చైర్మన్లు ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి), పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు), ఎస్.వి.ఎస్. అప్పలరాజు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కందుల విశ్వేశ్వరావు ఎంపిపి గుడాల రమేష్, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, జెడ్పిటిసి సుందరపల్లి శివ నాగరాజు, ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, ఆర్&బి ఎస్ఈ సి.ఎస్.ఎన్.మూర్తి, డిఈ సూర్యప్రకాశరావు, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.







