విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం.. పర్యాటకులకు నో పర్మిషన్‌

విశాఖపట్నం (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకొచ్చింది. దీంతో ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. మరోవైపు భూమి కోతతో సమీపంలోని చిల్డ్రన్‌పార్కులో ప్రహరీ గోడ కూలిపోయింది. అక్కడ ఉన్న బల్లలు విరిగిపోయాయి. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్‌ వద్దకు పర్యాటకులకు అనుమతి నిషేధించారు. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నోవాటెల్‌ హోటల్‌ ముందుభాగంలో బారికేడ్లు పెట్టారు. జవాద్‌ తుపాను నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us