UPDATED 27th SEPTEMBER 2022 WEDNESDAY 05:30 PM
CM Jagan : మా గురించి జగన్ మనసులో ఏముంది? ఆయన మాకు ఎన్ని మార్కులు వేస్తారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం అసలు ఆయన మాకు మళ్లీ టికెట్ ఇస్తారా? లేదా? వైసీపీ ఎమ్మెల్యేలను ఈ ప్రశ్నలు వెంటాడుతున్నాయి. సమావేశంలో జగన్ ఎలాంటి క్లాస్ తీసుకుంటారోనని ఎమ్మెల్యేలు, మంత్రులు తెగ టెన్షన్ పడుతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మొదలు పెట్టి మూడు నెలలు పూర్తి కావడంతో ప్రోగ్రామ్ ప్రోగ్రెస్ పై సర్వే చేయించారు సీఎం జగన్. ఆ సర్వే నివేదికల ఆధారంగా సమావేశంలో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.







