TTD: డిసెంబర్ 12న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల

Updated 9th December 2022 Friday 5:35 pm

TTD: వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను ఈ నెల 12న మధ్యాహ్నం 03:00 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సేవా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

అలాగే 2023 జనవరి నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవా టిక్కెట్లకు ఆన్‌లైన్‌ లక్కీడీప్ నమోదు ప్రక్రియ ఈ నెల 12న ఉదయం పది గంటల నుంచి డిసెంబర్ 14న ఉదయం పది గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పద్ధతిలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారిలోంచి లక్కీడీప్ ద్వారా విజేతలను ఎంపిక చేసి టిక్కెట్లు కేటాయిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి, ఆర్జిత సేవలను బుక్ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us