రెడ్ బీ న్యూస్,9 జనవరి 2022: కూల్ డ్రింక్ టిన్నుతో ఒక ఉడత చేసిన విన్యాసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. కూల్ డ్రింక్ టిన్నును నోటితో కరిచి పట్టుకుని గెంతులేస్తున్న వీడియో వైరల్ అయిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణం మెహర్ కాంప్లెక్స్ సమీపంలో నివసిస్తున్న పులుగు సత్య వరప్రసాద్ ఇంట్లో జరిగింది. ఓ ఉడుత ఇలా ఆడుతూ కనిపించడంతో దాన్ని వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.







