UPDATED 26th AUGUST 2017 SATURDAY 5:00 PM
పెద్దాపురం: స్థానిక శివాలయం వీధిలో ఉన్న నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై శనివారం గో గ్రీన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ వీధుల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచారం చేశారు. అనంతరం స్థానిక ఎంపిడివో కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపిపి గుడాల రమేష్, నారాయణ విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ పద్మజ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించేందుకు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ సిబ్బంది కృష్ణమూర్తి, బాలకృష్ణ, రామకృష్ణ, రాజేష్, వీరగణేష్, శైలజ, రోజారాణి, పల్లవి, దేవి, హైమ, చైతన్య, పార్వతి, లలిత, బిందు, అనిత, పిఇటి ఎస్.కె. గౌస్, అంజనికుమార్, అన్నపూర్ణ, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







