Fake case: డ్రగ్స్‌ కేసు భయంతో.. యువ నటి ఆత్మహత్య

ముంబయి (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: మహారాష్ట్రలో విస్తుపోయే ఘటన వెలుగు చూసింది. నకిలీ అధికారుల వేధింపులకు ఓ యువ నటి ఆత్మహత్యకు పాల్పడేలా చేశాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్​సీబీ) అధికారులమంటూ ఇద్దరు దుండగులు భయభ్రాంతులకు గురిచేయడంతో సదరు నటి అర్ధాంతరంగా తనువు చాలించింది. ఈ బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబయికి చెందిన ఓ యువ నటి (28) డిసెంబరు 20న ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ ఫైవ్​స్టార్​ హోటల్​లో పార్టీకి వెళ్లింది. అయితే అక్కడకు చేరుకున్న ఇద్దరు వ్యక్తులు తాము ఎన్​సీబీ అధికారులమంటూ.. డ్రగ్స్​ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశారు. అప్పటినుంచి డబ్బుల కోసం ఆమెకు పదేపదే ఫోన్​ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన నటి.. తన గదిలోని ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితులు సూరజ్ మోహన్ పరదేశి (38), పర్వీన్​ రఘునాథ్ వాలింబే ​(35)ను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నటి ఆత్మహత్య నేపథ్యంలో ఎన్​సీబీపై మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్​సీబీనే తమ ప్రైవేట్ ఆర్మీతో డబ్బుల కోసం మహిళను వేధించిందని ఆరోపించారు. ‘బాలీవుడ్ నటీమణుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఎన్​సీబీనే ఓ ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసింది. నకిలీ కేసుల పేరుతో వారిని బెదిరించి, డబ్బులను గుంజుతోంది. ఎన్​సీబీ ప్రైవేట్ ఆర్మీ వేధింపులు తట్టుకోలేకే సదరు నటి బలవన్మరణానికి పాల్పడింది’ అని మాలిక్ ఆరోపించారు. అయితే నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్‌సీబీ వెల్లడించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us