విజయదుర్గా పీఠంలో కన్నులపండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం

UPDATED 17th AUGUST 2017 THURSDAY 11:00 PM

రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠం 45 వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా గురువారం వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కళ్యాణం, త్రిశతి హొమాలు ఘనంగా నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చెందిన చెందిన వేద పండితులు సంపత్ గురుకుల్, గోపిగురుకుల్ ఆధ్వర్యంలో స్వామివారు, దేవేర్లకు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. దీనిలో భాగంగా విఘ్నేశ్వర పూజ, కలశస్థాపన, విగ్రహ ప్రతిష్ఠ, ఆదిత్యాది నవగ్రహ అష్టదిక్పాలకులకు పూజలు నిర్వహించారు. విజయదుర్గా అమ్మవారిని సర్వాభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం పీఠం గాడ్ భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల సంతాన ప్రాప్తి, శత్రుజయం, సకల శుభాలు కలుగుతాయన్నారు. అనంతరం శాంతి కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేశారు. రాష్ట్రం నలుమూలలనుంచి  వచ్చిన భక్తులు పీఠాధిపతి గాడ్ దివ్య ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు, పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి. బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబీ) తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us