UPDATED 25th OCTOBER 2017 WEDNESDAY 4:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కి చెందిన ప్రొఫెసర్ ఎస్.ఎన్.ఎస్.వి.ఎస్.సి. రమేష్ కు మలేషియాకు చెందిన సంస్థ ఇన్నోవేటివ్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రొఫెషనల్ మలేషియా ( ISRPM) సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫెషనల్ అవార్డుతో సత్కరించినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. తమ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా దశాబ్ద కాలానికి పైబడి సేవలందిస్తున్న రమేష్ కు ఈ అవార్డు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఎ. రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్, వివిధ శాఖల విభాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు అభినందించారు.







