Mahesh Babu: మహేశ్‌బాబుకు కొవిడ్‌ పాజిటివ్‌

రెడ్ బీ న్యూస్, 6 జనవరి 2022 : ప్రముఖ నటుడు మహేశ్‌బాబుకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ‘‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నా. వైద్యుల సలహాలు తీసుకుంటున్నా. ఇటీవల నన్ను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోండి. ఇప్పటివరకూ టీకా తీసుకోని వారు తక్షణమే తీసుకోండి. ఇది నా అభ్యర్థన. టీకా తీసుకుంటే ఆస్పత్రిలో చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దయచేసి అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించండి. జాగ్రత్తగా ఉండండి’’ అని ట్విటర్‌లో మహేశ్‌బాబు విజ్ఞప్తి చేశారు. మహేశ్‌ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంతో నటిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. యాక్షన్‌ కామెడీ నేపథ్యంలో దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్‌ 1న విడుదల చేస్తున్నట్టు కొన్నాళ్ల క్రితమే చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా పూర్తైన అనంతరం మహేశ్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవల.. దుబాయ్‌లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చల్ని జరిపారు. రాజమౌళి దర్శకత్వంలోనూ మహేశ్‌ నటించనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us