ఖరీఫ్ సీజన్ కు రైతులకు పూర్తి స్థాయిలో ఎరువుల పంపిణీ

* నవ నిర్మాణ దీక్షలో జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా
UPDATED 3rd JUNE 2018 SUNDAY 10:00 PM
తాళ్లరేవు: జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు ఎరువుల పంపిణీ పూర్తి స్థాయిలో చేపడతామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో జరిగిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఆదివారం కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి భద్రత, కరువు రహిత రాష్ట్రం అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో కలక్టర్ మాట్లాడుతూ ఎరువుల పంపిణీలో ఏ విధమైన కోత లేకుండా చర్యలు తీసుకుంటామని,  ఖరీఫ్ సీజన్ కు సాగునీటిని కల్పించడం కోసం డెల్టా కాలువలకు నీటిని విడుదల చేసామని, అదే విధంగా మైక్రో న్యూట్రియంట్స్ పంపిణీ కూడా చేపాడతామని అన్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకురావాలని, గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించడం కోసం ఓవర్ హెడ్ నిర్మాణం చేపడతామని అన్నారు. ముమ్మిడివరం నియోజక వర్గానికి 1300 పింఛన్లు అదనంగా మంజూరు అయ్యాయని,  వీటిని వచ్చే ఆరు, ఏడు రోజుల్లో పంపిణీ చేస్తామన్నారు. గ్రామంలో రేషన్ కార్డులు, పింఛన్లు పంపిణీలో సమస్యల ఉంటే మండలాధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. జిల్లాలలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఒక అంశంపై గ్రామస్థాయిలో చర్చలు జరుగుతాయని అన్నారు. అంతకు ముందు పటవల శివారు రాఘవేంద్రపురంలో జరిగిన గ్రామదర్శినిలో ముమ్మిడివరం ఎంఎల్ఏ దాట్ల బుచ్చిరాజుతో కలిసి కలక్టర్ పాల్గొన్నారు. గ్రామంలో గృహ నిర్మాణం, రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి వసతులను కలక్టర్ పరిశీలించి గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మార్కెట్ కమిటీ చైర్మన్ వి. సూర్యనారాయణ, ఎంపిపి టేకుమూడి అనంతలక్ష్మి, నియోజక ప్రత్యేక అధికారిణి నందినీ సలారియా, ఎంపిడివో చిన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us