UPDATED 13th FEBRUARY 2022 SUNDAY 10:30 PM
విశాఖ: నగర ఏజెన్సీలో దారుణఘటన చోటుచేసుకుంది. నాటు తుపాకీతో బావమరుదులు బావను కాల్చి చంపారు. పాతకక్షలతో చంపినట్లు పోలీసులకు మృతుడి బంధువులు ఫిర్యాదు చేశారు.
బావమరుదులు పెంటయ్య, నాగేశ్వరరావు పాంగి సుమత్‌ను కాల్చిచంపారు. చింతపల్లి మండలం కిటుముల పంచాయతీ భూసిబంధలో ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.







