AP Secretariat : సచివాలయంలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేత.. అందరూ రావాల్సిందే

UPDATED 18th FEBRUARY 2022 FRIDAY 07:00 PM

Covid In The AP Secretariat : ఏపీలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. వేల సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు వందల సంఖ్యలో రికార్డవుతున్నాయి. దీంతో అమల్లో ఉన్న నిబంధనలు, ఆంక్షలను ఎత్తివేస్తోంది. ఇప్పటికే ఉన్న రాత్రి వేళ కర్ఫ్యూను ఎత్తివేసింది. తాజాగా…సచివాలయంలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేసింది. ఈ మేరకు 2022, ఫిబ్రవరి 18వ తేదీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల వారు విధులకు హాజరు కావాలని ఉత్తర్వులో పేర్కొంది. బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు ఉంటుందని తెలిపింది. కోవిడ్ 19 నిబంధనలు ఎత్తివేయడంతో సచివాలయంలోని ఆయా శాఖల కార్యాలయాల నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us