UPDATED 8th FEBRUARY 2022 TUESDAY 03:30 PM
ఒంగోలు (రెడ్ బీ న్యూస్): జిల్లాలోని కొమరోలు మండలం తాటిచెర్లమోటులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో-బొలేరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.







