UPDATED 11th DECEMBER 2018 TUESDAY 9:00 PM
రాజానగరం: గైట్ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో 23వ జిల్లాస్థాయి అంతర పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ మీట్ (ఐపిఎస్ జిఎం) 2018 రెండో రోజైన మంగళవారం హోరాహోరీగా సాగాయి. జిల్లాలోని వివిధ పాలిటెక్నిక్ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులతో గైట్ ప్రాంగణం కళకళలాడుతోంది. వివిధ విభాగాల్లో జరుగుతున్న క్రీడాపోటీలు రసవత్తరంగా సాగాయి. ఈ పోటీలు ముగింపు కార్యక్రమం బుధవారం జరుగుతుందని గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిజి రామానుజం తెలిపారు. గైట్ కళాశాల వ్యాయామ అధ్యాపకులు డాక్టర్ సి. మంజ్రేకర్ హెన్రీ, వ్యాయామ అధ్యాపకులు పి. శివకుమార్, డి. సూర్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్. గంగాధర్, తదితరులు రిఫరీల సహాయంతో పోటీలను పర్యవేక్షిస్తున్నారు. చైతన్య విద్యాసంస్థల సిఇవో డాక్టర్ డిఎల్‌ఎన్.రాజు, గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐపిజిఎస్‌ఎం-2018 నోడల్ ఫిజికల్ డైరెక్టర్ విఠల్ మంగళవారం నాటి విజేతల వివరాలను ప్రకటించారు. 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, డిస్కస్‌త్రో, షార్ట్‌పుట్, జావలిన్ త్రో, ట్రిపుల్ జంప్ పోటీలు ముగిసాయని తెలిపారు. చదరంగం, టేబుల్‌టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్ కూడా పూర్తయ్యాయని, బ్యాడ్మింటన్, ఖోఖో ఫైనల్స్ పూర్తి కాగా, కబడ్డీ, వాలీబాల్ రౌండ్స్ జరుగుతాయని పేర్కొన్నారు.
చదరంగం: కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్ విద్యార్థి ఆర్. విశారధి, మహిళల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని కె. జీవితా నాగదుర్గ వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు.
టేబుల్ టెన్నిస్: సింగిల్స్‌లో ఎఎస్ సత్య (ఆదిత్య పాలిటెక్నిక్ ) విన్నర్‌గా నిలువగా, కె. బాల (కైట్-కోరంగి ) రన్నరప్ గా నిలిచారు. డబుల్స్‌లో ఎ. సత్య, ఎం. అనిత విన్నర్స్ కాగా, పి. నాగలక్ష్మి, ఎన్. బాల రన్నర్స్‌గా నిలిచారు.
బాల్ బ్యాడ్మింటన్: డబుల్స్ విభాగంలో గవర్నమెంట్ మహిళా పాలిటెక్నిక్ విన్నర్‌గా, ఆంధ్రా పాలిటెక్నిక్ (కాకినాడ) రన్నర్‌గా నిలిచాయి. సింగిల్స్‌లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ (కాకినాడ) విన్నర్‌గా, ఆంధ్రా పాలిటెక్నిక్ రన్నర్‌గా నిలిచింది. బాలుర విభాగం సింగిల్స్‌లో గైట్ పాలిటెక్నిక్ విన్నర్‌గా, జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీ రన్నర్‌గా నిలిచింది. డబుల్స్‌లో టి. కృష్ణకుమార్, సిహెచ్. చంద్రశేఖర్ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, కె. వీరేంద్ర, ఎం. రామారావు జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది.
షటిల్: బాలుర విభాగం డబుల్స్‌లో ఆంధ్రా పాలిటెక్నిక్ (కాకినాడ) విన్నర్స్‌గా నిలువగా, విఎస్‌ఎం కాలేజ్, (అమలాపురం) జట్టు రన్నరప్‌గా నిలిచింది. బాలికల విభాగం సింగిల్స్‌లో డి. చంద్రహారిక (గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహిళా కళాశాల-కాకినాడ) విన్నర్‌గా, సిహెచ్. అభిహారిక (ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల) రన్నరప్‌గా నిలిచారు. డబుల్స్‌లో బి. చంద్రహారిక, వి.ఆర్. మధుశ్రీ జట్టు విన్నర్స్‌గా, సిహెచ్. అభిహారిక, ఎస్. జీవన్ సంధ్య జట్టు రన్నర్‌గా నిలిచారు.







