UPDATED 25th MAY 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: గిరిజన సమస్యల పరిష్కారానికి వచ్చే నెల రెండవ తేదీన ఏలేశ్వరం వద్ద గల రమణయ్యపేటలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య జిల్లా జనరల్ బాడీ నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా శిక్షణా తరగతులు ఆహ్వాన సంఘం సమావేశం పార్టీ సీనియర్ నాయకులు ఎలిశెట్టి రామదాసు అధ్యక్షన శుక్రవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ సాధన సమితి, వామపక్షాల ఆద్వర్యంలో నిరసన దీక్ష స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష జరిగింది. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ కరణం ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలుచేయాలని కోరారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, ప్రజల జీవితాలు మెరుగుపడతాయని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ప్రత్యేకహోదా 11 రాష్ట్రాల్లో అమలులో ఉందని, ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రాలకు బడ్జెట్లో 30 శాతం కేటాయింపులు ఉంటాయని, కేంద్ర నిధులు 90 శాతం కేటాయిస్తాయని, పన్ను రాయితీలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రానికి తక్షణమే ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇచ్చేవరకూ పోరాడతామని చెప్పారు. జనసేన నాయకుడు సరోజ్ వాసు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం జనసేన పార్టీ ఎప్పుడూ పోరాడుతూనే ఉందని, అలాగే ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాల శ్రీను, వైఎస్ఆర్ సిపి నాయకులు మేకా శ్రీను, జనసేన పార్టీ నాయకులు సరోజ్ వాసు, తిక్కిరెడ్డి కాశీ విశ్వనాథ్, ఎండి సఫీయుల్లా, తుమ్మల ప్రసాద్, సిపిఎం నాయకులు పుప్పాల శ్రీనివాస్, బాలం శ్రీనివాస్, సిపిఐ కార్యదర్శి పెద్దిరెడ్డి సత్యనారాయణ, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్ కె ఫాతిమా, బిల్డింగ్ కార్యవర్గ యూనియన్ అధ్యక్షుడు బత్తుల బాలాజీ, ఎస్.ఎఫ్.ఐ నాయకులు పవన్, సిపిఐ నాయకులు బోడకొండ, ప్రజానాట్య మండలి నాయకులు కరణం గోవింద్, దుప్పట్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కరణం ప్రభాకరరావు, కరణం సత్యన్నారాయణ, రిక్షా సంఘం కె. మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.







