ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

Updated 29th April 2017 Saturday 3:00 PM

పెద్దాపురం: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పట్టణంలో పలు వార్డుల్లో రూ. 1 .25 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు  అభివృద్ది పనులకు ఆయన శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ వార్డుల్లో సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తానన్నారు. పట్టాణాభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని, పెద్దాపురం పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వపరంగా డ్వాక్రా మహిళలకు దశల వారీగా రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పట్టణంలో నూతన బస్ కాంప్లెక్స్, రైతు బజార్, శతాబ్ధి పార్క్ తో పాటు పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, భవిష్యత్తులో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం ఆయా వార్డుల్లో డ్రైన్లు, సిసి రోడ్లు, సామాజిక భవనాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ను పరిశీలించారు. మహిళలకు వనితా కార్డులు, వికలాంగులకు బస్ పాసులను ఆయన చేతుల మీదుగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు ( రాజబ్బాయి), మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, మున్సిపల్ కమీషనర్ ఏ. వెంకట్రావు, ఏ ఈ లు  సుధాకర్, లోవరాజు,  టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శిలు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, కౌన్సిలర్లు త్సలికి సత్య భాస్కరరావు, శెట్టి సుబ్బలక్ష్మి, వి. దుర్గాభవాని, కుంది ఉమామహేశ్వరి, కురసాల సూర్యావతి, జి. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
 
     
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us