CM Jagan: మేకపాటిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధను కలిగించింది: జగన్

UPDATED 21st FEBRUARY 2022 MONDAY 10:30 AM

అమరావతి : రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నాయకుడుగా పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధను కలిగించిదన్నారు. భారమైన హృదయంతో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని జగన్ తెలియజేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us