ఘనంగా ప్రారంభమైన మరిడమ్మ జాతర

UPDATED 23rd JUNE 2017 FRIDAY 10:00 PM

పెద్దాపురం : కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా రెండు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మరిడమ్మఅమ్మవారి జాతర మహోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా   ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసంలో నిర్వహించే మహోత్సవాల్లో భాగంగా గరగల నృత్యం, అమ్మవారి రథం, బ్యాండ్‌ మేళాలు, కోలాటం , కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచా తో జాతర ఉత్సాహంగా సాగింది. రాత్రి 8.30 గంటలకు, దేవస్థానం చైర్మన్ చింతపల్లి బ్రహ్మాజీ, మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబు రాజు జాతరను ప్రారంభించారు. మున్సిపల్‌ చైర్మన్‌ సూరిబాబు రాజు కు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌.పుష్పనాథం వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని జాతరను ప్రారంభించారు. అనంతరం అమ్మవారి గరగల నత్యం, కోలాటం, పులి ఆట, సంబరాల్లోని పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన  తిలకించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, దేవస్థానం ట్రస్టీలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.    

 
 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us