TDP : టీడీపీ 40 ఏళ్ల వ్యవస్ధాపక దినోత్సవాలు

UPDATED 29 MARCH 2022 TUESDAY 08:20 AM

Telugu Desam Party : తెలుగుదేశం పార్టీ 40వ వ్యవస్దాపక దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఈరోజు జరుపుకుంటున్నాయి. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గోంటుండగా… ఏపీలోని అమరావతిలో జరిగే కార్యక్రమాల్లో పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాల్గోంటారు.

1982 మార్చి 29న విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగు దేశం పార్టీని ప్రారంభించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లో పార్టీ ప్రకటించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలు దేరి ఎన్టీ ఆర్ ఘాట్ కు చేరుకుని ఎన్టీఆర్ సమాధికి నివాళులు అర్పించనున్నారు.

అనంతరం సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో జరిగే పార్టీ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గోంటారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us