AP News: అప్పుల కోసం ఆర్థిక మంత్రి హైరానా పడుతుంటే.. జిల్లాకో విమానాశ్రయమా?: అయ్యన్న పాత్రుడు

UPDATED 22 JANUARY 2022 SATURDAY 02:00 PM

విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) : రాష్ట్రం అప్పుల్లో ఉంటే జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తామని హామీలిస్తూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల పార్టేశారని.. ఉద్యోగులు, పింఛనుదారులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుల కోసం ఆర్థిక మంత్రి హైరానా పడుతుంటే జిల్లాకో విమానాశ్రయం ఎలా సాధ్యం అవుతుందని ఆయ ప్రశ్నించారు. గతేడాది శంకుస్థాపన చేసిన వైద్య కళాశాలలు ఏమయ్యాయని నిలదీశారు. విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయా స్థలాన్ని నేటి వరకూ కేటాయింకపోవడం అన్యాయమన్నారు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అన్నింటి కంటే ముందు కృషి చేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us