UPDATED 31 MARCH 2022 THURSDAY 07:00 AM
Karnataka Devotees Attack : కర్నూలు జిల్లా శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కన్నడిగులు అర్థరాత్రి హంగామా సృష్టించారు. జగద్గురు పీఠం సమీపంలోని షాపులపై దాడులకు పాల్పడ్డారు. దుకాణాలకు నిప్పుపెట్టారు. దీంతో పలు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాలనూ వదిలిపెట్టలేదు. పలు టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.
టీ స్టాల్ దగ్గర కన్నడ భక్తుడికి, టీ స్టాల్ యజమానికి మధ్య గొడవ జరిగింది. టీ స్టాల్ యజమాని కన్నడిగుడిపై దాడి చేయడంతో ఘర్షణ చెలరేగింది.
దీంతో కోపోద్రిక్తులైన కన్నడిగులు…షాపు యజమానులపై దౌర్జన్యానికి దిగారు. కర్రలతో చితకబాదారు. అంతేకాదు.. షాపులోని వస్తువులను రోడ్డుపై విసిరేసి నిప్పుపెట్టారు. అటుగా వచ్చే భక్తులపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరికి గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి కన్నడిగులు ఇంత బీభత్సం సృష్టిస్తుంటే… సెక్యూరిటీ సిబ్బంది స్పందించలేదు. కనీసం పోలీసులు కూడా చర్యలు తీసుకోలేదు. అల్లర్లను అదుపు చేయలేదు. దీంతో స్థానికులు, భక్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.