స్వచ్ఛ ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగాలి

UPDATED 15th JULY 2017 SATURDAY 6:00 PM

పెద్దాపురం : సమాజంలో ప్రతీ ఒక్కరూ స్వచ్ఛ ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగాలని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు అన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొన్నారు. ముందుగా తిరుపతి నుంచి దివిలి వెళ్ళే ప్రధాన రహదారిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్నతుప్పలను తొలగించారు. అనంతరం చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యపడుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ స్వచ్ఛ భారత్ దిశగా కృషి చేయాలన్నారు. ఇకపై తమ కళాశాల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ, కార్యానిర్వాహణాధికారి కె.  ఆర్. సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసీవో కొంగర పెదకాపు, వీరేంద్ర, సర్వం, తదిరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us