Prabhas: ప్రభాస్ జాతర.. డేట్స్ కోసం వెంటపడుతున్న ప్రొడ్యూసర్స్!

REDBEENEWS

తెలుగు హీరోలు జోరు మామూలుగా లేదు. ఓ పక్క కోవిడ్ – ఇండస్ట్రీతో ఒక ఆట ఆడుకుంటున్నా.. హీరోల జోరు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడు.. ప్లానింగ్, డిమాండ్ గురించి చెప్పక్కర్లేదు. అయిదు సినిమాలు క్యూలో ఉంటే.. ప్రభాస్ కోసం కనీసం ఇంకో మూడు ప్రాజెక్టులు డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇండియాలో ఈ మధ్య కాలంలో ఏ సూపర్ స్టార్ కూ లేనంత డిమాండ్ ప్రభాస్ కు ఉంది.వంద కోట్ల రూపాయలు ఏంటి… కావాలంటే ఇంకో పాతిక వేసుకుని సినిమా డేట్స్ ఇయ్యిబాబు అని ప్రొడ్యూసర్స్ ప్రభాస్ వెంటపడుతున్నారు.

ఓటిటిలో వారానికో సినిమా రిలీజయినట్లు… ప్రబాస్ సినిమాల లిస్ట్ చాంతాడంత పెరిగిపోతోంది. బాహుబలితో రెబల్ స్టార్ మహర్దశ మొదలైందని ఫాన్స్ ఎప్పుడో ఫిక్సైపోయారు. పక్కా లవ్ స్టోరీతో వస్తోన్న రాధేశ్యామ్ తో ప్రభాస్ మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.పూజ హెగ్డే కాంబినేషన్ లో వస్తున్న ఈ ప్రేమ కథా చిత్రమ్ పై ఆలిండియా లెవల్లో ఫాన్స్ ఎగ్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

రాధేశ్యామ్ కు దాదాపు రెండేళ్లకు పైగా తీసుకున్న ప్రభాస్ తర్వాత సినిమా విషయంలో మాత్రం సూపర్ ఫాస్ట్ గా ఉన్నాడు. ఓమ్ రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ సినిమా ఆల్ మోస్ట్ కంప్లీ ట్ అయింది. అన్నీ కుదిరితే క్రుతిసనన్ జోడిగా వస్తున్న ఆదిపురుష్ ఆగస్టులో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us