Viral Video: సమంత ఐటెం సాంగ్ కి బీటీఎస్ బ్యాండ్ స్టెప్పేస్తే..!

UPDATED 22 JANUARY 2022 SATURDAY 15:00 PM

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఆల్బమ్స్ ఎప్పుడూ సూపర్ హిట్టే.. తాజాగా వచ్చిన పుష్ప' అందుకు నిదర్శనం. ఊరమాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతి పాటా సెన్సేషనల్ అయ్యింది... ముఖ్యంగా 'ఊ అంటావా మావ... ఊఊ అంటావా' పాట యూట్యూబ్ లో మిలియన్లలో ప్యూస్ సొంతం చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. పురుషుల స్వభావాన్ని తెలియజేసే లిరిక్స్ తో రూపుదిద్దుకున్న ఈ ఐటెం సాంగ్ లో సమంత వంటి అగ్రకథానాయిక ఆడి పాడటంతో దీనికి మరింత క్రేజ్ వచ్చింది. స్క్రీన్ పై సామ్-బన్నీ వేసిన స్టెప్పులు చూసి ప్రతి ఒక్కరూ దీనికి ఫిదా అయిపోయారు. దీంతో ఈ పాటకు ఇప్పటికే పలువురు కవర్ సాంగ్స్, రీల్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు 'పుష్క' సాంగ్స్ ను కొంతమంది నెటిజన్లు ఎడిటింగ్ వీడియోలు క్రియేట్ చేసి అదరగొడుతున్నారు. ఇందులో భాగంగా, కొరియన్ ప్రముఖ పాప్ సింగింగ్ బ్యాండ్ బీటీఎస్ చేసిన 'బాయ్ విత్ లవ్ వీడియోకు 'ఊ అంటావా మావ' పాటను జత చేస్తూ ఓ నెటిజన్ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశాడు. "పుష్ప బీట్ ని బీటీఎస్ ఫాలో కాలేదు. బీటే బీటీఎస్ ని ఫాలో అయ్యింది" అని నెటిజన్ రాసుకొచ్చాడు. ఈ వీడియోలో బీటీఎస్ బృందం ఆర్ఎం, జిన్, సుగా, జై హోప్, జిమిన్, వి, జంగ్ సూక్ చేసిన స్టెప్పులు.. మన తెలుగు పాట ఓటుకు సరిపోయేలా ఉండటంతో ఈ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రధాని మోదీ 'శ్రీవల్లి' పాటకు స్టెప్పులేసినట్లుగా ఉన్న యానిమేటెడ్ వీడియోను మరో నెటిజన్ క్రియేట్ చేశాడు. ఇది కూడా' నెటిజన్లను ఆకర్షిస్తోంది. .

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us