Updated 10th March 2023 Friday 3:10 pm
YS Vivekananda Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం వరకు ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని అరెస్ట్ చేయొద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అవినాష్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి శుక్రవారం మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు.







