Premi viswanath : వంటలక్క ఆస్తి విలువ ఎంతో తెలుసా ? తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

UPDATED 7th NOVEMBER 2022 MONDAY 2:10 PM

Premi Viswanath: ప్రేమి విశ్వనాథ్ అనే పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ అదే కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క అందరికీ తెలుస్తుంది. వంటలక్క నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందిని కట్టిపడేసిన ఈ నటి స్టార్ హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.

కేరళ రాష్ట్రానికి చెందిన ప్రేమి విశ్వనాథ్ ఒకే సీరియల్ లో నటిస్తున్నప్పటికీ మిగిలిన ఏ సీరియల్ నటీనటులు కూడా ఈమెను బీట్ చేయలేకపోతున్నారంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈమె ఈ మధ్య కాలంలో సీరియల్స్ తో పాటు యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. అదేవిధంగా నాగచైతన్య సినిమాలో కూడా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్న ప్రేమీ విశ్వనాథ్ ఆస్తుల విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వంటలక్కకి కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయట. ఆ స్టూడియోలలో సినిమాలకు సంబంధించి, సీరియల్స్ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ తరుణంలోనే ప్రేమి విశ్వనాథ్ కి ఎంత ఆస్తి ఉండవచ్చనే చర్చ సోషల్ మీడియాల జరుగుతోంది. ఆమె ఆస్తులు రూ.40 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

కార్తిక దీపం సీరియల్ లో నటిస్తూనే.. ఫ్లవర్స్ టీవీలో ఓ కార్యక్రమానికి హోస్ట్ గా కూడా చేసింది. ప్రేమీ విశ్వనాథ్ భర్త డాక్టర్ వినీత్ భట్ 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు పొందారు.ప్రేమి విశ్వనాథ్ టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య నటించే NC22 లో నాగచైతన్యకి అక్కగా నటిస్తుందంటూ టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రలో క్లిక్ అయితే మాత్రం మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముంది. ప్రేమి విశ్వనాథ్ కి ఎంత ఆస్తి ఉన్నప్పటికీ ఆమె ఏమి లేని అమాయకురాలులా కనిపించడం విశేషం.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us