UPDATED 16th NOVEMBER 2017 THURSDAY 7:00 PM
పెద్దాపురం: ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలదే కీలకపాత్ర అని ఎంపీపీ గుడాల రమేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పత్రికాదినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై గురువారం మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజాలను వెలికితీసి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పత్రికలు పనిచేయాలన్నారు. నిజాలను నిర్భయంగా ప్రచురించినప్పుడే పత్రికలకు విలువ పెరుగుతుందని, ప్రజల్లో విలువ, విశ్వాసం పెరుగుతుందన్నారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు స్వాతి ప్రసాద్ మాట్లాడుతూ పత్రికలకు ప్రజాస్వామ్యంలో ప్రత్యేక స్థానం ఉందని, ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడే పత్రికలకు సమాజంలో మరింతగా విలువ పెరుగుతుందన్నారు. పత్రికా విలువలు కాపాడుతూ నిజాయితీగా పత్రికలు వాటి ధర్మాన్ని కాపాడాలని, ప్రజల కోసమే పత్రికలు పనిచేయాలన్నారు. అనంతరం సంఘ జిల్లా కార్యదర్శి సుంకర ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే గౌరవాదక్షుడు అడపా వెంకట్రావు, అధ్యక్ష, కార్యదర్శులు బూరాడ శ్రీనివాసరావు, రెడ్డిపల్లి రమణమూర్తి (బుల్లియ్య), జిల్లా సహాయ కార్యదర్శి మాసా చంద్రరావు (చందు), ఈసీ మెంబర్ పెమ్మాడి వీరభద్రవర్మ, మాజీ సీనియర్ పాత్రికేయుడు పుట్టా సోమన్న చౌదరి, వెలిది వెంకట రత్నం, పాత్రికేయులు ఇర్షాద్ ఆలీ, కొశెట్టి రాంప్రసాద్, ఆకుల మురళీకృష్ణ, పచ్చాకుల లోవరాజు, చవ్వాకుల ఈశ్వరరావు, రాజా శ్రీనివాస్, ఎలిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.







