హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణను వాయిదా వేసింది. అనంతరం శిల్పా చౌదరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. నార్సింగి పీఎస్‌లో ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి. రూ.7కోట్ల తీసుకొని ఆమె పలువురిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు రూ.30కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బంతా ఎక్కడికి మళ్లించారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడువని శిల్పా చౌదరి వెల్లడించారు.







