UPDATED 27th MAY 2018 SUNDAY 9:30 PM
సామర్లకోట: స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం అన్నారు. భీమేశ్వర లయన్స్ క్లబ్, కాకినాడ ఇనోదయ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో గుండె దడ, ఆయాసం, బిపి, షుగర్, బియంఐ, కామెర్లు, నరాల బలహీనత, కడుపునొప్పి, వాంతులు, మోకాళ్ల నొప్పులు, తదితర వ్యాధులకు సంబంధించి సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త పసల సత్యానందం, మద్దాల శ్రీను, కానుబోయిన విజయకృష్ణ, సేపేని సురేష్, లయన్స్ క్లబ్ మెంబర్ రెడ్డి, చిత్తులూరి వీర్రాజు, జిలాని, నేతి బాబ్జీ, మేకా శ్రీను, ఉబేదుల్లా, వైద్యులు డాక్టర్ గొడవర్తి రామ్మోహన్, ఎల్. దేవి, ఎం. శ్రీనివాస్, సత్య సౌజన్య, కె.ఎన్.వి. సతీష్, నితీష్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.







