Updated 26th April 2017 Wednesday 7:30 PM
పెద్దాపురం: ప్రతీ గ్రామానికీ సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి మంచినీటి వాటర్ ప్లాంట్ ను ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ప్రతీ ఒక్కరికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్లను ప్రతీ గ్రామంలో ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి), టిడిపి మండలాధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు(కోటి), జెడ్పిటిసి సుందరపల్లి శివనాగరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలిశెట్టి నాని, పిహెచ్ సి చైర్మన్ తుమ్మల వీరాస్వామి నాయుడు, మండల కో ఆప్షన్ సభ్యుడు బొడ్డు వెంకన్న, తుమ్మల రాము, సర్పంచ్ తుమ్మల అజ్ఞావతి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ ఈ ఎం. సాయి లీల తదితరులు పాల్గొన్నారు.







