నూతన వ్యవసాయ విధానాలపై రైతులను చైతన్య పరచాలి

UPDATED 4th JUNE 2017 SUNDAY 9:00 PM

కాకినాడ: జిల్లాలో సాగునీటి వినియోగం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల్లో అధిక దిగుబడి సాధించేలా రైతులను చైతన్యవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న నవ నిర్మాణ దీక్ష పై నియోజకవర్గ అభివృద్ధి అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో డెల్టాకు ఖరీఫ్ కు నీరు విడుదల చేయడం జరిగిందని, సాగులో మెళకువలు పాటించడంపై రైతులను చైతన్యం చేయాలన్నారు. జిల్లాలో ఆదర్శ రైతుల అనుభవాలను ఇతర రైతులకు తెలియచేయాలని, అదేవిధంగా జిల్లాలో చేపడుతున్న నీరు చెట్టు పనులు, పండ్ల తోటలు, మెట్ట ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్, పంట సంజీవిని వంటి పధకాలను రైతులకు వివరించాలని, అలాగే వ్యవసాయం, అనుబంధ రంగాలపై విస్తృత చర్చ జరగాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో జన్మభూమి కమిటీ సభ్యులు హాజరు కావాలని, పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాల పై ప్రజలలో అవగాహన కల్పించి వారిని భాగస్వామ్యం చేయాలని, కళాజాతాలు, ప్రచార సామాగ్రి, ఎక్సిబిషన్ ల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. అన్ని నియోజక వర్గాల్లో ప్రత్యేక అధికారులు, ఇతర శాఖల సిబ్బంది హాజరు కావాలని ఆయన ఆదేశించారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us