భారత్‌లోకి మళ్లీ వచ్చేస్తున్నాం.. ప్రకటించిన పబ్‌జీ

న్యూఢిల్లీ:(రెడ్ బీ న్యూస్) పబ్‌జీ మొబైల్ ప్రియులకు ఇది శుభవార్తే. చైనాకు చెందిన 116 యాప్స్‌తోపాటు పబ్‌జీ మొబైల్‌ను భారత ప్రభుత్వం ఇటీవల నిషేధించింది. దీంతో అక్టోబరు 30 నుంచి దేశంలోని పబ్‌జీ యూజర్ల ప్రాప్యతను పబ్‌జీ కార్పొరేషన్ నిలిపివేసింది. అయితే, ఇప్పుడు మరో కొత్త పేరుతో భారత్‌లో తిరిగి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత్‌లో త్వరలోనే ‘పబ్‌జీ మొబైల్ ఇండియా’ను లాంచ్ చేయబోతున్నట్టు చెప్పిన పబ్‌జీ కార్పొరేషన్.. ఎప్పుడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. షెంజెన్‌కు చెందిన టెన్సెంట్ గేమ్స్‌కు భారత్‌లో పబ్‌జీ ఫ్రాంచైజీ అధికారం ఇవ్వబోమని తేల్చి చెప్పింది. భారతదేశ నిబంధనలకు అనుగుణంగా పూర్తి డేటా భద్రతతో గేమ్‌ను తిరిగి తీసుకొస్తున్నట్టు పేర్కొంది. డేటాకు పూర్తి రక్షణ కల్పించడంలో భాగంగా భారత వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరిచే స్టోరేజీ స్టిస్టమ్స్‌పై ఎప్పటికప్పుడు ఆడిట్, వెరిఫికేషన్స్ నిర్వహిస్తామని వివరించింది. స్థానిక అవసరాలను ప్రతిబింబించేలా ఆటలోని కంటెంట్‌ను మెరుగుపరుస్తామని పబ్‌జీ డెవలపర్లు పేర్కొన్నారు. వర్చువల్ సిమ్యులేషన్ ట్రైనింగ్ గ్రౌండ్ సెట్టింగ్, క్లాథింగ్, కొత్త కేరెక్టర్లు, ఎరుపునకు బదులుగా గ్రీన్ హిట్ ఎఫెక్ట్స్ వంటి మార్పులు ఉంటాయని చెప్పారు. యువ ఆటగాళ్ల కోసం భవిష్యత్తులో ఆట సమయాన్ని పరిమితం చేస్తామని కూడా పేర్కొన్నారు. కాగా, పబ్‌జీ కార్పొరేషన్, దాని మాతృ సంస్థ క్రాఫ్టన్‌లు భారత్‌లో లోకల్ వీడియో గేమ్, ఈ-స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీ ఇండస్ట్రీలు స్థాపించేందుకు 100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 746 కోట్లు) పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తున్నాయి.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us