UPDATED 8TH MAY 2017 MONDAY 11:00 AM
పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రి వద్ద సోమవారం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటుచేశారు. ఈ చలివేంద్రాన్ని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఒక్కరూ చలివేంద్రాలు ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో డాక్టర్ సుదీప్తి, అభివృద్ధి కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.







