లెనోరాలో అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు

* భారీ జాతీయ పతాకం ఆవిష్కరణ
* సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపిన ప్రజలు
* ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలు
UPDATED 26th JANUARY 2018 FRIDAY 7:30 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఉన్నకెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా కళాశాల సెక్రటరీ మధుసూధన్ రెడ్డి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని, దేశంకోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించాలన్నారు. భారతీయులుగా జన్మించడం మన అదృష్టమన్నారు. కళాశాల  ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాశ్ షెట్టి మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ, దేశ ప్రగతికి కృషి చేయాలన్నారు. అలాగే డైరెక్టర్లు నాగార్జునరెడ్డి, ప్రసాద్ చౌదరి గణతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియచేశారు. అలాగే మంచి ప్రవర్తనతో నడుచుకోవాలని సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడులకలో భాగంగా కళాశాల ఆధ్వర్యంలో తయారుచేసిన భారీ జాతీయపతాకాన్ని క్రేన్ ల సహాయంతో జాతీయ రహదారిపై ప్రదర్శనగా ఏర్పాటుచేశారు. ఈ పతాకం వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు ఎగబడ్డారు. అనంతరం విద్యార్థులు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి సాయిబాబా దేవాలయం, సూర్యారావుపేట, జాతీయ రహదారి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం మానవహారంగా ఏర్పడి దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యకమంలో కళాశాల సెక్రటరీ వై. మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి, డైరెక్టర్లు జి. నాగార్జునరెడ్డి, ఎ. ప్రసాద్ చౌదరి, డాక్టర్ బి. లక్ష్మణరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. దాల్ సింగ్, వివిధ విభాగాధిపతులు, ఏవో అనురాధ, చింతా శ్రీను, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.     
  
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us