UPDATED 27th SEPTEMBER 2017 WEDNESDAY 7:00 PM
పెద్దాపురం: స్థానిక మెయిన్ రోడ్ లో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరీ మందిరంలో దసరా శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని మూలా నక్షత్రం సందర్భంగా బుధవారం ఘనంగా సరస్వతీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేదారిశెట్టి వెంకట్రావు, శ్రీరామ్ ప్రకాష్, బొండాడ సరన్న, రేపాక ప్రసాద్, తమ్మన శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







