AP News: తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలు

తిరుపతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022: చిత్తూరు జిల్లా తిరుపతి వేదికగా జాతీయ క్రీడల నిర్వహణ చారిత్రాత్మక ఘట్టమని ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నేటి నుంచి ఈనెల 9వరకు జరగనున్న జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతి ఇందిరా మైదానంలో అట్టహాసంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి 42 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ కొవిడ్ తరువాత జరుగుతున్న క్రీడా పోటీలకు తిరుపతి ఆతిథ్యం ఇవ్వడం విశేషమన్నారు. క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఈ జాతీయ పోటీలు తోడ్పదతాయన్నారు. తిరుపతి వేదికగా నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు క్రమశిక్షణ, అంకితభావంతో రాణించాలని, తిరుమల వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉంటాయని తెలిపారు. అర్జున అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ్, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, తిరుపతి ఎంపీ గురుమూర్తి, స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us