UPDATED 16th FEBRUARY 2022 WEDNESDAY 10:00 AM
ముచ్చింతల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ముచ్చింతల్‌లోని సమతామూర్తి, 108 దివ్యదేశాల సందర్శనకు ఇవాళ్టి నుంచి భక్తులను అనుమతించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు దర్శనానికి అనుమతించనున్నారు. అయితే.. ప్రస్తుతానికి రామానుజాచార్యుల స్వర్ణమూర్తి దర్శనానికి అనుమతించడంలేదు. సాంకేతిక కారణాలతో త్రీడీ మ్యాపింగ్ షో తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పారు. త్వరలో స్వర్ణమూర్తి దర్శనంతో పాటు త్రీడీ లేజర్‌షో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈ నెల 2 నుంచి అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.
ప్రతి రోజు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ముచ్చింతల్ లోని శ్రీరామనగరం అధ్యాత్మక వాతావరణంలో మునిగిపోయింది. ఫిబ్రవరి 02వ తేదీ 261 సువర్ణ సమతామూర్తిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోకార్పణం చేసిన సంగతి తెలిసిందే.







