కాకినాడ (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: కాకినాడ రావడం ఇదే ప్రథమం.. నగరం చాలా బాగుంది.. ఇక్కడి కాజా, వంటకాలకు మంచి పేరుంది.. ఇప్పుడు ఇక్కడి మహిళల మనసులు దోచే ముగ్ధ పట్టుచీరల ప్రత్యేక షోరూం ప్రారంభానికి రావడం తన అదృష్టమని సినీ నటి ప్రగ్యా జైస్వాల్ అన్నారు. నగరంలోని మెయిన్ రోడ్డులో టౌన్‌హాల్ వద్ద ఉన్న చిక్కాల టవర్స్‌లో బుధవారం ముగ్ధ స్టోర్ పేరుతో సరికొత్త కంచిపట్టు చీరల షోరూంను ఆమె ప్రారంభించారు. జ్యోతిని వెలిగించిన అనంతరం పట్టు చీరలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ టెంపుల్ థీమ్ స్టోర్ అనేది ముగ్ద స్టోర్స్‌కు ప్రత్యేకమన్నారు. టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్‌గా, లాక్మే వంటి ప్రఖ్యాత ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొన్న ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను కాకినాడ నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమన్నారు. స్టోర్ నిర్వాహకురాలు శశి వంగపల్లి మాట్లాడుతూ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో షోరూంలు ప్రారంభించినట్లు తెలిపారు. తమ 14వ స్టోర్‌ను కాకినాడలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రత్యేకమైన, ఉత్తమమైన కలెక్షన్లు అందరికీ అందుబాటు ధరల్లో అందిస్తామన్నారు. తామెప్పుడూ నాణ్యతపైనే దృష్టి సారిస్తామని, డిజైన్ల పరంగానూ ఉత్తమమైనవి ఇవ్వాలని ఆశిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ దంపతులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.







