UPDATED 12th JULY 2017 WEDNESDAY 1:00 PM
పెద్దాపురం : పెద్దాపురం పట్టణంలో ఉన్న పాండవుల మెట్ట పైకి రోప్ వే ని ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మహారాణి కళాశాల ఎదురుగా ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన స్థలాన్ని, పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజా సౌకర్యం, పరిపాలన సౌలభ్యం కొసం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఓకే చోట ఉండేలా స్థలాన్ని కేటాయించి, పనులు ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన స్థలం ఇరిగేషన్ శాఖకు చెందినదని, మొత్తం 13.96 ఎకరాల స్థలంలో మోడరన్ రెసిడెన్సియల్ పాఠశాల, డిఎస్పీ, కమర్షియల్ టాక్స్, వ్యవసాయశాఖ, ఎంపీడీవో, మార్కెటింగ్ ట్రెజరీ కార్యాలయాలకు కేటాయించామని చెప్పారు. శతాబ్ధి పార్కు నుంచి పాండవుల మెట్ట పైకి రోప్ వే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పంచాయతీ రాజ్ జేఈ ఎం. రామకృష్ణయ్య, ఎంపీడివో వసంత మాధవి, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు ఆఫీస్ కొలతలు, బిల్డింగ్ ముఖ ద్వారం, పార్కు స్థలం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలోఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారు బాబు, ఎంపీపీ గుడాల రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, మండల కో-ఆప్షన్ సభ్యుడు బొడ్డు వెంకన్న, ఉలిమేశ్వరం ఎంపిటిసి పేకేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.







