AP News: కరోనా కట్టడిపై సీఎం సమీక్ష

Updated 27 January 2022 Thursday 10:20 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తీసుకోవాలసిన చర్యలపై అధికారులతో సీఎం జగన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సీఎంకి అధికారులు వివరించారు. 1.06 లక్షలకుపైగా కేసుల్లో కేవలం 2,709 మందే ఆస్పత్రుల్లో చేరారని వారు పేర్కొన్నారు. ఇందులో ఐసీయూలో చేరినవారు కేవలం 287 మందేనని అధికారులు పేర్కొన్నారు. 18 ఏళ్లపైబడినవారికి 90.34 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తైందన్నారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్యనున్నవారికి 98.91 శాతం మొదటి డోస్‌ పూర్తైందన్నారు. జిల్లాల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us