Updated 10th April 2017 Monday 12:25PM
పెద్దాపురం : మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పెద్దాపురం ఏరియా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సుదీప్తి తెలిపారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆరోగ్యమేళా లో గర్భిణీలకు ఆమె వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 78 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అంద చేశారు. అలాగే ముగ్గురు గర్భిణీలను హైరిస్క్ గా గుర్తించామని ఆమె పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనంలో ప్రసవం జరిగిన మహిళలను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ వర్మ, హెచ్ వి ఎం రత్నకుమారి, ప్రభోద, సరోజ తదితరులు పాల్గొన్నారు.







