గణపతిశాస్త్రి ఇంట స్పీకర్, హోంమంత్రి

UPDATED 9th JULY 2018 MONDAY 9:30 PM

సామర్లకోట: కంచి మహా సంస్థానం చైర్మన్ చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి 74వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర హోంమత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా సామర్లకోటలో ఆయన స్వగృహంలో కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేశారు. గణపతిశాస్త్రి వారితో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం స్పీకర్, హోంమంత్రి, జిల్లా కలెక్టర్ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో ఎస్.ఎస్.వి.బి. వసంతరాయుడు, తహసీల్దార్ ఎల్. శివకుమార్, మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, సీనియర్ కౌన్సిల్ మన్యం చంద్రరావు, భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, టిడిపి నాయకులు చల్లా బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us