CM YS Jagan: సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

Updated 16th April 2023 Sunday 12:20 pm

CM YS Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి  (ap cm jaganmohan reddy) అనంతపురం జిల్లా (Anantapur district) పర్యటన వాయిదా (Tour postponed) పడింది. షెడ్యూల్ ప్రకారం.. సోమవారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో వసతి దీవెన కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి జగన్ మోహన్‌రెడ్డి హాజరై వసతి దీవెన పథకంలో భాగంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల సోమవారం జగన్ పర్యటన వాయిదా పడినట్లు సీఎంవో అధికారులు ప్రకటించారు.

రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం సోమవారం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో జరిగే ఈ ఇప్తార్ విందులో సీఎం జగన్ పాల్గోనున్నారు. ఈ క్రమంలో అనంతపురం కార్యక్రమం వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

తిరిగి ఈ నెల 26న సీఎం జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తారని సీఎంవో అధికారులు తెలిపారు. 26న అనంతపురం జిల్లా నార్పలలో సీఎం పర్యటించనున్నారని, జగనన్న దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారని చెప్పారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us