UPDATED 20th FEBRUARY 2022 SUNDAY 07:30 PM
AP Corona Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 335 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజు(425)తో పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనాతో చనిపోయారు.
చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. ఒక్కరోజు వ్యవధిలో 936మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 19వేల 241 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,29,77,640 కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,16,585. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 22,94,818. రాష్ట్రంలో 6వేల 754 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.







